పోషకాల మెండు..  బొప్పాయి పండు..

బరువును తగ్గించటంలో బొప్పాయి పండు బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు..

బొప్పాయిలో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా ఉండేలా చేయటంలో దోహదపడుతుంది.

ఇందులోని కె-విటమిన్‌ వల్ల ఎముకలు బలానికి ఉపకరిస్తుంది..

బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

శరీరంలో పేరుకు పోయిన అదనపు కొవ్వులను కరిగించటంలో ఉపకరిస్తుంది. దీని వల్ల వేగంగా బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది.

విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటికి మేలు కలిగిస్తుంది.

జుట్టు ఆరోగ్యానికి చక్కటి మార్గం బొప్పాయి...

బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు ఫ్లేవనాయిడ్స్‌, పాలీఫినాల్స్‌ వల్ల దగ్గు, జలుబు లాంటివి దరిచేరకుండా ఉంటాయి.