పంచదారను ప్రాసెస్‌ చెయ్యడానికి ముందు రూపమే పటికబెల్లం. దీనిని కలకండ అని కూడా అంటారు. మిశ్రీ అంటారు. పటికబెల్లం పంచదార కన్నా మంచిది

పటికబెల్లంలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి

కేవలం మాంసాహారంలో దొరికే ముఖ్యమైన విటమిన్లు, విటమిన్ బి12 పటికబెల్లంలో ఎక్కువ మొత్తంలో దొరుకుతుంది

మూడు, లేదా నాలుగు దొండ పండ్లను పటికబెల్లం పొడిలో అద్దుకొని తింటూ ఉంటే దగ్గు తొందరగా తగ్గిపోతుంది

వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి రెండు లేక మూడు పూటలు తాగితే గొంతు బొంగురు తగ్గిపోతుంది

పటికబెల్లం పొడి అరస్పూను, పుదీనా ఆకుల రసం టీ స్పూన్‌ కలిపి రోజూ రెండు లేక మూడు పూటలు సేవిస్తూ ఉంటే దద్దుర్లు తగ్గుతాయి

వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు పటికబెల్లం ఔషధంగా పనిచేస్తుంది

పటికబెల్లం కంటి చూపుకి బాగా పని చేస్తుంది. భోజనం తరువాత చిన్న పటిక బెల్లం ముక్క నోట్లో పెట్టుకుంటే కంటికి మంచిది

అరటిపండును పటికబెల్లం పొడితో అద్దుకొని తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు త‌గ్గుతాయి

ఎండాకాలంలో పటికబెల్లం పొడిని నీటిలో వేసుకుని తాగితే అతి దాహం తగ్గడంతో పాటు వడదెబ్బ తగలదు

ఒక్కోసారి అనుకోకుండా ముక్కులోంచి రక్తం వస్తుంది. దీంతో వెంటనే పటికబెల్లం కలిపిన నీటిని బాధితుడికి ఇస్తే రిలీఫ్ లభిస్తుంది

పటిక బెల్లం మగవారిలో వీర్యం క్వాలిటీని మెరుగు పరుస్తుంది

పటికబెల్లం ముక్కను కొద్దిగా నీళ్లతో అరగదీయగా వచ్చిన ఆ గంధాన్ని తేలు కుట్టిన చోట రాసి మర్దన చేస్తూ ఉంటే 6 నిమిషాల్లో తేలు విషం హరించబడుతుంది