సంక్రాంతి పండుగ వచ్చిందంటే నువ్వులతో చేసిన అరిసెలు,  కరకరలాడే సకినాలు గుర్తుకు వస్తాయి

అరిసెలు చేయటానికి ఉపయోగించే  దినుసుల్లో అన్నీ ఆరోగ్యకరమైనవే

బెల్లంలో ఐరన్ ఉంటుంది. నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఉంటుంది

నువ్వులను అరిసెల లో తిన్నా...బెల్లంతో కలిపి నువ్వుల లడ్డూ తిన్నా ఆరోగ్యానికి మంచిదే

ఇది మహిళల్లో హార్మోన్‌ లెవెల్స్‌ను మెయింటెయిన్‌ చేస్తుంది. నువ్వుల్లో పీచు పదార్ధం ఎక్కువ. ఇందు వల్ల అరుగుదల బావుంటుంది

నువ్వులు ఫైబర్‌ను కలిగి ఉంటాయి. వీటినే లిగ్నిన్స్ అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది

కొన్ని రకాల గుండె జబ్బులు, కొన్ని రకాల కాన్సర్లు, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్ వంటివి రాకుండా ఈ పీచు పదార్ధం కాపాడుతుంది

నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ 'ఇ' కూడా సమృద్ధిగా ఉంటుంది

టాబ్లెట్స్ రూపంలో తీసుకునే కాల్షియం చాలా భాగం జీర్ణమే కాదు.....

.....కానీ నువ్వుల ద్వారా లభించే కాల్షియం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిల్లో 20 శాతం ప్రొటీన్ వుంటుంది

డయటరీ ఫైబర్ ని అందించడం దగ్గర నుండి సౌందర్యాన్నీ యవ్వనాన్నీ కాపాడడం వరకూ నువ్వులు మనకి ఎన్నో విధాల మేలు చేస్తాయి