మనిషికి మట్టికి మంచి అనుబంధం ఉంది. మనిషి మట్టి నుంచే వచ్చి..మట్టితోనే సహజీవనం చేసి..తిరిగి అదే మట్టిలోనే కలసిపోతాడు మనిషి. ఇదంతా ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియ.

మట్టి పాత్రల్లోని నీరు తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

మట్టిలో వివిధ రకాల విటమిన్లు, ఖనిజ లవణాలుంటాయి. మట్టికుండల్లోనూ ఇవే ఉంటాయి. మట్టిలో ఉండే పోషకాలు కుండ ద్వారా దానిలో నింపిన నీటిలోకి చేరతాయి. అందుకే ఈ నీరు ఆరోగ్యకరం

మట్టికుండలకు కంటికి కనిపించని చిన్న చిన్న రంధ్రాలుంటాయి.  ఇవి నీటిని వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా చల్లబరుస్తాయి. ఎండ ఎక్కువగా ఉంటే నీరు చాలా చల్లగా తయారవుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే కుండలో నీరు ఓ మాదిరిగా చల్లబడుతుంది.

ప్లాస్టిక్‌లో ఉండే  హానికారక రసాయనాల వల్ల నీరు కలుషితమవుతుంది. కానీ మట్టి పాత్రలు హానికరమైన రసాయనాలతో నీటిని కలుషితం కానివ్వవు.

ఫ్రిజ్‌లో నిల్వ చేసిన నీరు వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి.కుండలో ఉంచిన నీటిని తాగడం వల్ల అలాంటి సమస్యలేమీరావు.

కుండలో నీటిని తాగడం వల్ల వడదెబ్బ తగలదు. కుండలో నిల్వ ఉంచిన నీటిలో అదనపు పోషకాలు చేరతాయి. ఈ నీటిని తాగడం వల్ల చెమట ద్వారా శరీరం కోల్పోయిన విటమిన్లు, మినరల్స్ తిరిగి అందుతాయి.

కుండలో నీటిని తాగితే..గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. కుండలో నిల్వ చేసిన నీరు ఆల్కలీన్ స్వభావాన్ని కలిగిఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పీహెచ్ విలువను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

కుండలో నిల్వ ఉంచిన నీరు ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఫలితంగా మెటబాలిజం ప్రక్రియ సైతం మెరుగుపడుతుంది.