తులసి మొక్కే కాకుండా వీటి గింజలు కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

తులసి గింజలను నిత్యం తీసుకోవ‌డం ద్వారా పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

 జలుబు, దగ్గు చికిత్సకు సహాయపడతాయి.

దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి నీటిలో తులసి గింజలు, తేనె కలిపి తీసుకోవాలి.

శరీరం బరువును తగ్గించుకోవడంలో సహాయపడుతాయి. 

రక్తపోటు, చక్కెర స్థాయిలను తగ్గించడానికి  ఉపయోగపడతాయి. 

టైప్-2 మధుమేహం ఉన్నవారికి ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి.

మహిళల్లో అండోత్సర్గం, సంతానోత్పత్తికి సాయపడతాయి.

ఋతుస్రావం, గర్భధారణ సమయంలో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.

అండాశయాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

తుల‌సి గింజ‌ల‌ను మోతాదుకు మించి తీసుకోకూడ‌దు. 

వీటిని తీసుకొనే ముందు వైద్య నిపుణుల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటించాలి.