గోరింటాకు కేవలం అందం కోసమేనని చాలా మంది భావిస్తుంటారు.

గోరింటాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మ‌న పూర్వికులు ముఖ్యంగా గోరింటాకును ఆషాఢమాసంలో పెట్టుకోవాలని చెబుతారు.

వానాకాలం సీజ‌న్‌లో వాతావరణం చల్లగా, ఒంట్లో వేడిగా ఉండడం వలన శరీరం త్వరగా రోగాల బారిన పడుతుంది.

గోరింటాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

గోరింటాకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. ఒంట్లో వేడినీ తగ్గించడానికి సహాయపడుతుంది.

పుచ్చిపోయిన గోర్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా చూసుకోవచ్చు.

స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి

గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగుతాయి.

శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను తగ్గించడంలోనూ గోరింటాకు సహాయపడుతుంది.

జుట్టు రాలే సమస్యను గోరింటాకు తగ్గిస్తుంది.