నట్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి..గుండెకు చేటు చేసే కొలెస్ట్రాల్ ను నట్స్ తగ్గిస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనల్లో తేలింది..

చెడు కొలెస్ట్రాల్ ఉంటే రోజూ నట్స్ తినడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తినకుండా..రోజుకు 20 గ్రాములు తీసుకోవాలి.

ఆక్రోట్స్ లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ లభిస్తాయి. సాల్మోన, ట్యునా వంటి ఖరీదైన చేపల్లో దండిగా లభించే విలువైన మంచి ఫ్యాట్స్ ఇవి..

బాదం గింజల్లో విటమిన్ ఈ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. హాని కారకాల వల్ల కణాలు దెబ్బతినకుండా ఇది రక్షణనిస్తుంది. జీవక్రియలు సజావుగా సాగేందుకు సాయపడుతుంది.

వేరుశనగల్లో విటమిన్ బీ3, నయసిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మంచి ప్రొటీన్, ఫైబర్ లభిస్తాయి. వీటిల్లో ఉండే ఫైటోస్టెరోల్స్, అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

పిస్తా గింజల్లో ఫైటోస్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించే సహజసిద్ధమైన ఆహారం ఈ గింజలు..

జీడిపప్పులో జింక్, కాపర్, మెగ్నీషియం, సిలీనియం, విటమిన్ కే ఇందులో తగినంత లభిస్తాయి. ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే.

నట్స్ ను సలాడ్స్, పండ్లు, మిల్క్ షేక్ లతో కలిపి తీసుకోవచ్చు. కర్రీల్లో, గ్రేవీల్లో, వెగ్గీ సూప్ లలో కూడా కలుపుకుని తినొచ్చు.

బాదం వంటి గింజలను రాత్రి నీటిలో నానవేసి మర్నాడు ఉదయం తీసుకోవడం కూడా మంచిది..