గుండెపోటు వచ్చే సమయంలో కొన్ని లక్షణాలు హెచ్చరికల రూపంలో ముందస్తుగానే కనిపిస్తాయి.
గుండెపోటుకు ప్రాథమిక లక్షణం ఛాతి నొప్పి.
గుండెపోటు వచ్చే ముందు ఛాతి మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యంగా ఉంటుంది.
ఇదే సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఒత్తిడి, కండరాలు పిండేసినట్లు అనిపించడం, తెలియని నొప్పి వంటి పరిస్ధితి ఉంటుంది.
ఏం జరుగుతుందో కూడా ఏమీ అర్ధం కాదు.
గుండెపోటు సమయంలో కొందరిలో వాంతులు కూడా అవుతాయి.
శరీరంలోని ఎడమ వైపు భాగాల్లో నొప్పి రావడం.
సాధారణంగా ఈ నొప్పి ఛాతి నుంచి మొదలవుతుంది. క్రమంగా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.
ఎడమ చెయ్యి లేదా ఎడమ వైపు భుజం కండరాల్లో నొప్పి ఉంటుంది.
ఇలా నొప్పి అనిపిస్తే గుండె పోటు లక్షణంగా అనుమానించవచ్చు.
అలాగే ఛాతీ మధ్యలో నొప్పి ఒత్తిడి వల్ల గొంతు, దవడ వరకు వ్యాపిస్తే అది గుండెపోటుకు సంకేతంగా భావించాలి.