చలికాలంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం 50శాతం అధికం.
ఇప్పటికే గుండెపోటు వచ్చి చికిత్స పొందుతున్నవారు. మధుమేహం, అధిక రక్త పోటు బాధితులు జాగ్రత్తగా ఉండాలి.
ధూమపానం చేసేవారు, శారీరక వ్యాయామానికి దూరంగా ఉండేవారికి చలికాలంలోగుండెపోటు అవకాశాలు ఎక్కువ.
గుండెపోటు లక్షణాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఛాతి మధ్య, పైభాగంలో నొప్పివస్తే గుండెపోటు లక్షణాలుగా అనుమానించాలి.
దవడ లాగినట్లుగా ఉండటం, చెమటలు పట్టడం.
ఛాతి నుంచి ఎడమ, కుడి చేతుల వైపు, గొంతు వైపు నొప్పి వ్యాపించడం.
శ్యాస తీసుకోవటం కష్టమవడం.
ఛాతి పట్టేసినట్లుగా బరువుగా ఉండటం.
చలికాలంలో ఈ లక్షణాలు స్వల్పంగా ఉన్నా సరే అత్యవసరంగా వైద్యుడిని సంప్రదించాలి.