కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించగా ఆయన నటించిన జేమ్స్ సినిమా మార్చి 17న రిలీజయింది. ఇందులో పునీత్ పాత్రకి తన అన్నయ్య శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు

అతిలోక సుందరి శ్రీదేవి అతిథి పాత్రలో నటించిన జీరో సినిమా ఆమె మరణించిన తర్వాత విడుదల అయ్యింది

ఎమ్మెస్ నారాయణ చనిపోయిన తర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు విడుదలవగా.. అందులో మొదటగా సన్నాఫ్ సత్యమూర్తి రిలీజయింది

ఉదయ్ కిరణ్ నటించిన చివరి సినిమా చిత్రం చెప్పిన కథ పలుమార్లు విడుదలకి ప్రయత్నించగా ఇప్పటికీ విడుదల కాలేదు

దివ్య భారతి హీరోయిన్ గా నటించిన తొలిముద్దు సినిమా షూటింగ్ మధ్యలో ఆమె చనిపోవడంతో దివ్య భారతి స్థానంలో రంభతో పూర్తిచేసి సినిమాపై రిలీజ్ చేశారు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన దిల్ బేచారా సినిమా పూర్తయ్యాక ఆయన మరణించగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేశారు

ప్రముఖ సీనియర్ నటుడు ఓం పురి ముఖ్య పాత్రలో నటించిన ట్యూబ్ లైట్ సినిమా ఓం పూరి చనిపోయిన తర్వాత విడుదల అయ్యింది

ప్రముఖ తమిళ నటుడు వివేక్ గుండెపోటుతో మరణించగా ఆయన నటించిన అరణ్మనై 3 సినిమా ఆ తర్వాత విడుదల అయ్యింది

లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరావు నటించిన మనం సినిమా కూడా ఆయన చనిపోయిన తర్వాత విడుదల అయ్యింది

కన్నడ హీరో విష్ణువర్ధన్ నటించిన ఆప్త రక్షక సినిమా కూడా ఆయన చనిపోయిన తర్వాతే విడుదల అయ్యింది

వీళ్ళే కాదు.. మరికొంత మంది నటుల సినిమాలు కూడా వారు మరణించిన తర్వాత విడుదల అయ్యాయి

వీళ్ళే కాదు.. మరికొంత మంది నటుల సినిమాలు కూడా వారు మరణించిన తర్వాత విడుదల అయ్యాయి

వీళ్ళే కాదు.. మరికొంత మంది నటుల సినిమాలు కూడా వారు మరణించిన తర్వాత విడుదల అయ్యాయి