మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు  ముఖ్యమైనది మాత్రం ఆహారమే.

మనం తీసుకునే ఆహారంలో సరైన జాగ్రత్తలు పాటించాలి..

తినేఆహారం కూడా పోషకాలతో ఉండాలి. రోజుకు రెండు లేదా మూడు సార్లు భోజనం చేయటంతోపాటు , డ్రై ఫ్రూట్స్, పండ్లు , కూరగాయలతో కూడిన స్నాక్స్ తీసుకోవాలి.

ఆహారంలో రోజుకు కనీసం 400 గ్రాముల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలతో పాటు పెరుగు, ఫ్రూట్ సలాడ్ లను స్నాక్స్ గా తీసుకోవచ్చు.

పీచు పదార్ధాలు ఎక్కువగా ఉండేలా చూడాలి. నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

కొవ్వు చేరని ఆహార పదార్ధాలు తినాలి. 100 గ్రాముల పాల ఉత్పత్తుల్లో మూడు గ్రాముల కొవ్వు ఉంటుంది. కాబట్టి కొవ్వు తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులతోపాటు, స్కిన్ లెస్ చికెన్ వంటివి తీసుకోండి.

మాంసాహారులైయితే వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినటం మంచిది. శాఖాహారులు చిరుధాన్యాలు అధికంగా తీసుకోవటం వల్ల మేలు కలుగుతుంది.

ఆహారంలో ఉప్పు, చక్కెర తక్కువగా ఉండేలా చూసుకోండి. సోడియం రోజుకు 2,300 మిల్లీ గ్రాముల అంటే ఓ టీ స్పూన్ కు మించకుండా ఉండేలా జాగ్రత్త పడండి.

ప్రతిరోజు ఒక గంట సమయం వ్యాయామానికి కేటాయించండి. దీని వల్ల రోజు మొత్తం చురుకుగా ఉండటంతోపాటు, ఆరోగ్యంగా ఉండవచ్చు.