జాతీయ జెండా విషయంలో తప్పకుండా పాటించాల్సిన రూల్స్.
చిరిగిన, నలిగిన, పాత జెండా ఎగరేయకూడదు.
3 రంగులు, అశోక చక్రం తప్ప మరో రంగు, రాతలు ఉండకూడదు.
కాషాయ రంగుపైకి, ఆకుపచ్చ రంగు దిగువకు ఉండాలి.
జాతీయ జెండాకు సరిసమానంగా, దానికన్నా ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు.
జాతీయ జెండాను నేలపై అగౌరవప్రదంగా పడేయకూడదు.
వస్తువులు, భవనాలపై జెండాను కప్పకూడదు.
పబ్లిక్ మీటింగుల్లో ప్రేక్షకులకు ఎడమవైపు జెండా ఉండాలి.
సాంస్కృతిక, క్రీడా వేడుకల్లో పేపర్ తో చేసిన జాతీయ జెండాలనే వాడాలి.
ఈవెంట్ అయిపోయాక జాతీయ జెండాలను నేలపై పడేయకూడదు.
ప్లాస్టిక్ తో చేసిన జెండాలు వాడకూడదు.