ఆధార్ కార్డులో మీ ఫొటో మార్చుకోవాలా?
ఆధార్ కార్డులో ఫొటో బాగోలేదని చాలామంది బాధపడుతుంటారు.
ఇలాంటి వారు ఫొటో మార్చుకోవాలంటే తప్పకుండా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లాలి.
డాక్యుమెంట్ నింపి ఆపరేటర్ కు అందించాలి.
ఆ తర్వాత బయోమెట్రిక్ తీసుకుని, ఫొటో తీస్తారు.
ఆ తర్వాత అక్‌నాల్డెజ్‌మెంట్ స్లిప్ ఇస్తారు.
ఫొటో మార్పు కోసం కొంత డబ్బు చెల్లించాలి.
అలాగే పేరు, మొబైల్ నెంబర్ మార్చుకోవాలన్నా ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిందే.