ఎక్కువ సమయం కంప్యూటర్‌, మొబైల్‌ స్క్రీన్‌ చూడడం వల్ల కళ్లు ఒత్తిడికి గురై అలసిపోతుంటాయి.

కళ్ల ఒత్తిడిని తగ్గించే మాస్క్ లు ఇంట్లోనే సులభంగా చేసుకోవ‌చ్చు.

రోజ్‌వాటర్‌లో కాటన్‌ ముక్కను కాసేపు నానబెట్టాలి.

కాటన్‌ను రెండుకళ్లపై మొత్తం కప్పిఉంచి, పదిహేను నిమిషాలు తరువాత తీసేయాలి.

టీ బ్యాగ్‌ల ద్వారా కూడా క‌ళ్ల‌కు ఒత్తిడిని త‌గ్గించుకోవ‌చ్చు.

టీ బ్యాగ్ ను చల్లటి నీటిలో నానబెట్టాలి. నీటిని పిండి కళ్లమీద పెట్టుకోవాలి.

ఇలా ప‌ది నిమిషాలు చేయడం వల్ల కళ్లకు ఒత్తిడి త‌గ్గుతుంది.

కంటిచుట్టూ నల్లని వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

బంగాళదుంప, పుదీనా ముఖాన్ని అందంగా ఉంచడంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

కళ్ల ఒత్తిడిని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి.

పుదీనా రసం, బంగాళ దుంప రసాన్ని బాగా కలిపి పదినిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.

మిశ్రమం చల్లబడిన తరువాత.. కాటన్‌ బాల్‌ను ముంచి కళ్లమీద పెట్టుకోవాలి.

కళ్ల ఒత్తిడి తగ్గడంతోపాటు, కళ్లచుట్టూ ఏర్పడిన ముడతలు తగ్గుముఖం పడతాయి.

వీటిలో ఏ ఒక్కటి పాటించినా కళ్లకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.