హీరోలు తమ మార్కెట్ పెంచుకునేందుకు, డైరెక్టర్లు తమ సత్తా చాటేందుకు, నిర్మాతలు తక్కువ ఖర్చుతో సినిమా తీసి రెండు భాషల్లో డబ్బులు సంపాదించడానికి ఇటీవల అందరూ బైలింగ్వల్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో రాబోతున్న  బై లింగ్వల్ సినిమాలు

తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి విజయ్, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ ‘వరిసు’ తెలుగులో 'వారసుడుగా' రాబోతున్నాడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రానుంది.

ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తోన్న 'సార్' సినిమా కూడా బైలింగ్వల్ సినిమానే.

రామ్ పోతినేని లింగుస్వామి డైరెక్షన్ లో రాబోతున్న 'ది వారియర్' సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన బైలింగ్వల్ మూవీ. ఈ సినిమా జులై 14న రిలీజ్ కానుంది.

జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ నటిస్తున్న బైలింగ్వల్ మూవీ 'ప్రిన్స్'. ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేయనున్నారు.

నాగ చైతన్య - కృతి శెట్టి కాంబోలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో తెలుగు – తమిళ్ సినిమాని అనౌన్స్ చేశారు.

వీరే కాక మరికొంత మంది తమిళ, తెలుగు స్టార్స్, డైరెక్టర్స్ పరస్పర సహకారంతో బైలింగ్వల్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో తెలుగు-తమిళ్ లో కలిపి సినిమాలు నిర్మించారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ ట్రెండ్ మొదలైంది. దీనివల్ల అందరికి లాభమే.