హీరోలకి పెద్ద హిట్ ఇస్తే వాళ్ళు డైరెక్టర్స్ కి ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉంటారు. ఇటీవల కొంచెం ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు. కొంతమంది అయితే డైరెక్టర్ తో పాటు వేరే టీం మెంబర్స్ కి కూడా ఇచ్చారు. ఇటీవల డైరెక్టర్స్ కి గిఫ్ట్ లు ఇచ్చిన హీరోలు..

తాజాగా విక్రమ్ సినిమా హిట్ అయినందుకు డైరెక్టర్ లోకేష్ కి కమల్ హాసన్ కోటి రూపాయల లెక్సస్ కారు ఇచ్చారు.

అన్నాత్తే సినిమా హిట్ అయినందుకు రజినీకాంత్ డైరెక్టర్ శివకి గోల్డ్ చైన్ ప్రజెంట్ చేశారు.

NTR సినిమా హిట్ అయినా అవ్వకపోయినా డైరెక్టర్స్ కి వాచ్ లు కొనిస్తాడు. గతంలో బాబీ, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, పూరి జగన్నాధ్, కొరటాల శివ లాంటి డైరెక్టర్స్ కి ఖరీదైన వాచ్ లు ఇచ్చాడు.

సూర్య, జ్యోతిక కలిసి పొన్మగల్ వందల్ సినిమా డైరెక్టర్ ఫ్రెడ్రిక్ కి యాపిల్ ల్యాప్టాప్ కొనిచ్చారు.

సింగం 3 సినిమా డైరెక్టర్ హరికి సూర్య టొయోట కార్ కొనిచ్చారు.

గ్యాంగ్ సినిమాకు సూర్య డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి ఓ టొయోట కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు.

శ్రీమంతుడు హిట్ అయినందుకు కొరటాల శివకి మహేష్ బాబు ఆడి కార్ కొనిచ్చారు.

ఇలా చాలా మంది హీరోలు తమ డైరెక్టర్స్ కి, తమ టీంకి స్పెషల్ గిఫ్ట్ లు ఇస్తూ మరింత ప్రోత్సహిస్తున్నారు.