మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలతో తెలుగు సినిమాలలో మెప్పించిన హీరోలు

సీనియర్ ఎన్టీఆర్ కులగౌరవం, శ్రీకృష్ణసత్య, శ్రీమద్విరాట పర్వం, దానవీరశూరకర్ణ , శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర చరిత్ర సినిమాల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రల్లో నటించారు.

అక్కినేని నాగేశ్వరరావు నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించారు.

హీరో కృష్ణ.. కుమార రాజా, పగపట్టిన సింహం, రక్త సంబంధం, బంగారు కాపురం, బొబ్బిలిదొర, డాక్టర్ సినీ యాక్టర్, సిరిపురం మొనగాడు.. ఇలా దాదాపు ఏడు సినిమాల్లో మూడు పాత్రల్లో నటించి మెప్పించారు.

శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్లు అనే సినిమాలో మూడు పాత్రల్లో నటించారు. ఇది రజినీకాంత్ నటించిన ‘మూండ్రు ముగమ్’ సినిమాకి రీమేక్.

మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు అనే సినిమాలో మూడు పాత్రల్లో నటించి మెప్పించారు.

రజినీకాంత్ తమిళ్ లో నటించిన ‘మూండ్రు ముగమ్’ సినిమాని చాలా రోజుల తర్వాత ముగ్గురు మొనగాళ్లు అనే పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇందులో రజినీకాంత్ మూడు పాత్రల్లో నటించారు.

కమల్ హాసన్ ‘విచిత్ర సోదరులు’ సినిమాలో మూడు పాత్రలు, ‘మైఖేల్ మదన కామ రాజు’ చిత్రంలో నాలుగు పాత్రలు, ‘దశావతారం’ సినిమాలో ఏకంగా పది పాత్రలు చేసి మెప్పించారు.

బాలకృష్ణ అధినాయకుడు సినిమాలో మూడు పాత్రల్లో మెప్పించారు.

తమిళ హీరో సూర్య తెలుగులో 24 సినిమాలో ఇద్దరు అన్నదమ్ములు, ఒక కొడుకు పాత్రలో మెప్పించాడు.

ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో ముగ్గురు అన్నదమ్ముల పాత్రల్లో నటించాడు.

తమిళ హీరో విజయ్ నటించిన మెర్సెల్ తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ అయింది. ఇందులో విజయ్ తండ్రి, ఇద్దరు కొడుకులుగా మెప్పించారు.

అక్కినేని నాగార్జున సినిమాలలో చేయకపోయినా బిగ్ బాస్ యాడ్ కోసం ఒకేసారి మూడు పాత్రల్లో కనిపించి మెప్పించాడు.

సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సినిమాలో మూడు పాత్రల్లో కనిపించాడు.