మన తెలుగు సినిమాలకి నైజాం(తెలంగాణ) ఏరియా చాలా కీలకం. మన సినిమాలకి కలెక్షన్లు అధికంగా ఇక్కడినుంచే వస్తాయి. ఇప్పటివరకు నైజాంలో మొదటి రోజు అత్యధిక షేర్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు..
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా నైజాంలో మొదటిరోజు 11.85 కోట్ల షేర్ వసూలు చేసి మొదటి స్థానంలో ఉండి రికార్డు సృష్టించింది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' సినిమా ఫస్ట్ డే నైజాంలో 11.44 కోట్ల షేర్ వసూలు చేసింది.
తాజాగా వచ్చిన ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా నైజాంలో మొదటి రోజు 10.45 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఫస్ట్ డే నైజాంలో 9.41 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
ప్రభాస్ 'బాహుబలి 2' సినిమా మొదటి రోజు నైజాంలో 8.9 కోట్ల షేర్ వసూలు చేసింది. అప్పటి వరకు అదే హైయ్యస్ట్ కలెక్షన్.
పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఫస్ట్ డే నైజాంలో 8.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి ఫస్ట్ డే నైజాంలో 8.67 కోట్ల షేర్ వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా తొలి రోజు నైజాంలో 8.10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
మహేష్ బాబు హీరోగా నటించిన 'మహర్షి' సినిమా ఫస్ట్ డే నైజాంలో 6.38 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది.
ప్రభాస్ 'బాహుబలి 1' సినిమా మొదటి రోజు నైజాంలో 6.35 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.