ఎక్కువ రోజులు టెలికాస్ట్ అయిన టాప్ 10 తెలుగు సీరియల్స్

'అభిషేకం' సీరియల్ 2008 డిసెంబర్ 22న మొదలవ్వగా 2022 ఫిబ్రవరి 1న ముగిసింది. 4000 ఎపిసోడ్స్ తో హైయెస్ట్ రికార్డు సృష్టించింది ఈ సీరియల్. ఈ సీరియల్ ని దివంగత దాసరి నారాయణరావు బ్యానర్ లో నిర్మించారు.

'ఆడదే ఆధారం' సీరియల్ 2009 జనవరి 26న మొదలై 2020 మార్చ్ 14 వరకు 3329 ఎపిసోడ్స్ తో సాగింది.

'మనసు మమత' సీరియల్ 2011 జనవరి 31న మొదలై 2021 నవంబర్ 17న 3305 ఎపిసోడ్స్ తో ముగిసింది.

'అత్తారింటికి దారేది' సీరియల్ 2014 నవంబర్ 10న మొదలై 2230కి పైగా ఎపిసోడ్స్ తో ఇంకా సాగుతుంది.

'స్వాతి చినుకులు' సీరియల్ 2013 సెప్టెంబర్ 9న మొదలై 2126 ఎపిసోడ్స్ తో 2020 సెప్టెంబర్ 19 వరకు సాగింది. ఈ సీరియల్ కి ప్రముఖ డైరెక్టర్ క్రిష్ కథ అందించారు.

'నా పేరు మీనాక్షి' సీరియల్ 2015 జనవరి 26న మొదలై 2022 జనవరి 18న 2000 ఎపిసోడ్స్ తో ముగిసింది.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సీరియల్ 2015 సెప్టెంబర్ 21న మొదలై 1970 ఎపిసోడ్స్ కి పైగా ఇంకా కొనసాగుతుంది.

'చంద్రముఖి' సీరియల్ 2007 మే 21న మొదలై 2013 సెప్టెంబర్ 7న 1850 ఎపిసోడ్స్ తో ముగిసింది.

'అంతఃపురం' సీరియల్ 2009 మార్చ్ 2న మొదలై 2014 నవంబర్ 8న 1755 ఎపిసోడ్స్ తో ముగిసింది.

'భార్యామణి'  సీరియల్ 2009 మార్చ్ 30న మొదలై 2014 నవంబర్ 15న 1741 ఎపిసోడ్స్ తో ముగిసింది.