మారుతున్న జీవనశైలి..తినే ఆహారంలో మార్పుల వల్ల..  గ్యాస్ సమస్యలు పెరుగుతున్నాయి.

గ్యాస్ సమస్యలకు ఇంట్లో లభించే కొన్ని రకాల పదార్ధాలతోనే సులభంగా చెక్ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది.

గ్యాస్ సమస్యను పొగొట్టేందుకు కొబ్బరి నీళ్లు బాగా ఉపకరిస్తాయి. రోజు కొబ్బరి నీళ్లను తాగటం అలవాటు చేసుకుంటే గ్యాస్ నుండి ఉపశమనం పొందవచ్చు.

పుదీనా ఆకులు..లేదా కరివేపాకు, కొత్తిమీర...జీలకర్ర వేసిన మజ్జిగ తాగితే..గ్యాస్ సమస్యకు చక్కటి పరిష్కారం..

తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవ్వాలంటే రోజూ ఉదయాన్నే పరగడుపున రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకోవాలి.

చల్లార్చిన గ్లాసు పాలలోకి ఒక స్పూను తేనె కలుపుకుని తాగటం వల్ల గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చు.

తులసి ఆకుల్ని వేడి నీటిలో వేసి మరిగించి చల్లారిన ఈ తులసి నీటిని తాగితే గ్యాస్ నుండి ఉపశమనం కలుగుతుంది.

దాల్చిన చెక్క టీ తాగితే..గ్యాస్ సమస్య ఇట్టే పోతుంది.. జీర్ణశయాంతర ప్రేగులలో ఉండే ఇన్ఫెక్షన్లను సైతం నయం అవుతాయి.