డాండ్రఫ్ నివారించేందుకు ఇంటి చిట్కాలు

డాండ్రఫ్ నివారించేందుకు ఇంటి చిట్కాలు

ఆలివ్ ఆయిల్ వాడితే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. తద్వారా హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ అందిస్తాయి.

ఒత్తిడిని దరి చేరనివ్వకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను షాంపూ లేదా కొబ్బరినూనెలో కలిపి కొంత సేపటికి తలస్నానం చేయాలి.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు, అవిసె విత్తనాలు, వాల్‌నట్స్ తింటే వెంట్రుకల సమస్యలన్నీ పోతాయి. 

బేకింగ్‌ సోడాను తలపై పోసి మర్దనం చేయాలి. 

ఆస్ప్రిన్‌ మాత్రలు రెండింటిని పొడిచేసి రెగ్యులర్‌ షాంపూతో కలిపి తలకు మర్దనం చేయాలి. 2-3 నిమిషాల తర్వాత కడిగేయాలి. 

పెరుగును వెంట్రుకల మొదళ్ల వరకు వెళ్లేలా పూయాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత నీటితో కడగాలి.

నిమ్మరసం జుట్టు మొదళ్ల వరకు వెళ్లేలా రాసి 2,3 నిమిషాలు ఆరబెట్టి షాంపూతో కడగాలి. 

అలోవెరా చర్మం చికాకును తగ్గించడమే కాకుండా మాయిశ్చరైజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. 

మెంతి గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండి జుట్టు పొడిబారడం, రాలడాన్ని, చుండ్రును నివారిస్తాయి.