130 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ కంపెనీ తొలిసారి భారత మార్కెట్లోకి సబ్బును ప్రవేశపెట్టింది

ఆ త‌ర్వాత నార్త్ వెస్ట్ సోప్ కంపెనీ 1897లో మీరట్‌లో సబ్బుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది

మరి స‌బ్బులు రాక‌ముందు ఇండియాలో బ‌ట్టలు ఎలా ఉతికేవారు? 

స‌బ్బు రాకముందు రాజులు, ధ‌న‌వంతులు కుంకుడు కాయ‌ల ర‌సంతో బట్టలు ఉతికించేవారు

ఇందుకోసం కుంకుడు చెట్ల‌ను పెంచడమే కోసం ప్రత్యేకంగా మనుషులను పెట్టుకునేవారు

సాధార‌ణ జ‌నాలు వేడినీళ్లలో నానబెట్టిన బట్టలను బండరాయి కేసి బాదేవారు

పొలాలు, నదీతీరంలో దొరికే తెల్ల‌టి సౌడు మ‌ట్టితో కూడా బ‌ట్ట‌లుతికేవారు

రెహ్ అనే ఒక ర‌క‌మైన ఖ‌నిజాన్ని వాడి బ‌ట్ట‌ల మరకలను వదిలించేవారు