ఏ కూరగాయలను ఫ్రిజ్లో పెట్టొచ్చు? ఎన్ని రోజుల్లోపు వాడుకోవచ్చు?
టమాటాలు బయటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి.
టమాటాలను ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అనవసరం. రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల రుచిపోతుంది.
బ్రొకోలీ, క్యాలిఫ్లవర్ 3 నుంచి 5 రోజలు వరకు రిఫ్రిజిరేటర్ లో ఉంటాయి.
పాలకూర, ఇతర ఆకు కూరలను రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవచ్చు.
కొన్ని 3-5 రోజుల వరకు, మరికొన్ని వారం వరకు పోషకాలు కోల్పోకుండా ఉంటాయి.
కనుక ఆకు కూరలను 5 రోజుల్లోపు వినియోగించుకోవాలి.
వేరుజాతికి చెందిన క్యారట్ రిఫ్రిజిరేటర్ లో మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి.
ముల్లంగి అయితే ఫ్రిజ్ లో రెండు వారాలు తాజాగా ఉంటుంది.
బంగాళాదుంప, చిలగడదుంపను రిఫ్రిజిరేటర్ లో పెట్టొద్దు.
వాటిని గది ఉష్ణోగ్రతలోనే ఉంచేయాలి. వారం రోజుల వరకు వీటిలోని పోషకాలు మిగిలే ఉంటాయి.
ఉల్లి, వెల్లుల్లి ఫ్రిజ్ లో, బయట కూడా పెట్టుకోవచ్చు.
కాకపోతే మిగిలిన కూరగాయలు, పండ్లకు వీటిని దూరంగా పెట్టాలి.
వెల్లుల్లి ఫ్రిజ్ లో చాలా వారాలు నిల్వ ఉంటుంది. ఉల్లి సైతం రెండు నెలలు తాజాగా ఉంటుంది.
10 రోజుల పాటు రిఫ్రిజిరేటర్ లో మష్ రూమ్ తాజాగా ఉంటుంది.
టమాటాలు బయటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి.