ఆధార్‌లో ఎన్నిసార్లు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు..?

ఆధార్ కార్డులో తప్పుల సవరణకు, అప్ డేట్ కు అవకాశం ఉంది. 

కొన్ని వివరాలను పదే పదే మార్చుకోవడానికి వీలులేదు.

పేరు, జెండర్(లింగం), పుట్టిన తేదీ తదితర వివరాలను ఒకసారి మాత్రమే మార్చుకునే వీలు.

పేరు నమోదులో తప్పులు దొర్లితే రెండుసార్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. 

వివాహం తర్వాత మహిళలు తమ ఇంటి పేరును మార్చుకునే వీలుంటుంది. 

ఆన్ లైన్ లో సొంతంగా లేదా మీ సేవా సెంటర్ లో ఆధార్ కార్డులోని పేరును మార్చుకోవచ్చు.

జెండర్.. ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు యూఐడీఏఐ వీలు కల్పించింది.

పుట్టిన తేదీ.. కేవలం ఒక్కసారి మాత్రమే మార్పు చేసుకునే అవకాశం.

నివాస స్థలం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఫొటో..

వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లలో ఎన్నిసార్లు అయినా మార్పులు చేసుకోవచ్చు.

చిరునామా, ఫోన్ నెంబర్ మారొచ్చు, వయసుతో పాటు శరీరంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. 

అందుకే ఈ వివరాలకు సంబంధించిన సవరణలకు యూఐడీఏఐ ఎలాంటి పరిమితి విధించలేదు.