టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్‌కు పాకిస్తాన్ జట్టు చేరుకుంది. 

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

13న (ఆదివారం) మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో పాక్ ఆడుతుంది. 

10న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో పాక్‌తో తలపడుతుంది. 

2007 టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్ వరకూ చేరింది.

ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. భారత జట్టు కప్ గెల్చుకుంది.

2009లో జరిగిన టోర్నీలోకూడా పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరింది. కప్ గెలిచింది. 

13 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది.

ఈసారి కూడా భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో తలపడే అవకాశం ఉంది.

భారత్-పాకిస్తాన్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడాలని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.