2005 నుంచి ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 

మూడు ఫార్మాట్‌లలో కలిపి 12 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. 

ఉప్పల్ స్టేడియంలో భారత్ ఆరు వన్డేలను ఆడింది.

మూడింటిలో విజయం సాధించగా మరో మూడింటిలో ఓటమి పాలైంది. 

రెండు టీ20 మ్యాచ్‌లలో ఒకటి వర్షం కారణంగా రద్దయింది.

 జరిగిన ఒక్క టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.

ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ముఖాముఖీగా నాలుగు సార్లు (మూడు ఫార్మాట్‌లలో) తలపడ్డాయి.

రెండు సార్లు భారత్, రెండు సార్లు ఆస్ట్రేలియా గెలిచి సమవుజ్జీగా ఉన్నాయి. 

టీ20 ఫార్మాట్‌లో మాత్రం ఈ రెండు జట్ల మధ్య ఈ స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్

ఉప్పల్ స్టేడియంలో 2007 అక్టోబర్ 5న జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోయింది.

2009 నవంబర్ 5న రెండసారి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది.

2013 మార్చి 2 నుంచి 5 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగ్గా.. భారత్ గెలిచింది. 

2019 మార్చి 2న భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడోసారి వన్డే మ్యాచ్ జరగ్గా.. భారత్ గెలిచింది.