ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరు బాగా తాగాలి.

నీరు తాగడంలో అశ్రద్ధ చూపితే అనారోగ్యం పాల‌వుతారు.

రోజులో ఎంత నీరు తీసుకోవాలనేది తెలుసుకోవాలి.

శరీరతత్వం, శారీరక శ్రమల స్ధాయి, వాతావరణం అంశాలని బట్టి నీటి మోతాదు తీసుకోవాలి. 

రోజుకు క‌నీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.

ఉదయం లేవగానే తప్పనిసరిగా రెండు గ్లాసుల నీళ్లు తాగాలి.

వ్యాయామాలు చేసే ముందుగా రెండు గ్లాసులు నీళ్లు తాగాలి. 

టిఫిన్, భోజనంకు అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగాలి.

దీనివ‌ల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.

స్నానం చేసే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి.

రక్తపోటు రాకుండా కాపాడుకోవచ్చు.

రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి.

అలాచేస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ.