క్రికెట్ అంపైర్ కావాలంటే.. అర్హతలు ఇవే

అంపైర్‌గా వ్యవహరించే వ్యక్తిని ఎలా సెలెక్ట్ చేస్తారో తెలుసా?

వాళ్లకు క్రికెట్ ఆడిన అనుభవం ఉంటుందా? 

అసలు అంపైర్ కావాలంటే ఏం చేయాలి?

క్రికెట్‌లో అంపైర్‌గా వ్యవహరించే వ్యక్తికి క్రికెట్ ఆడిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదు.

నిర్దిష్ట విద్యార్హత ఏమీ లేదు.

చదవడం, రాయడం వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడటం రావాలి.

42 క్రికెట్ చట్టాలపై అవగాహన ఉండాలి.

వివిధ థియరీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన తర్వాత బీసీసీఐ నిర్వహించే పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి.

ఎక్కువ సమయం గ్రౌండ్‌లో ఉండాలి.

దృష్టి, వినికిడి, ఏకాగ్రతతో పాటు త్వరగా నిర్ణయం తీసుకునే సామర్ధ్యం కలిగుండాలి.

ఏకకాలంలో నోబాల్స్, వైడ్ బాల్స్, ఓవర్‌లో ఎన్ని బాల్స్ అయ్యాయి..

ఎన్ని వికెట్లను కోల్పోయింది వంటి మల్టీ టాస్క్‌ను నిర్వహించే సామర్ధ్యం ఉండాలి.