తామర (రింగ్ వార్మ్) చాలా చికాకు పెడుతుంది.
తామర నుంచి ఉపశమనం పొందటానికి పలు రకాల వస్తువులను వినియోగించొచ్చు.
ఆవాలతో తామరకు స్వస్తి చెప్పొచ్చు.
చర్మాన్ని వేడినీటితో శుభ్రంగా కడిగి బట్టతో అద్ది తడిలేకుండా చూసుకోవాలి.
తర్వాత ఆవాలను ముద్దగా నూరి సమస్య ఉన్నచోట పూయాలి.
బొప్పాయి ముక్కలను రోజుకు రెండుసార్లు రుద్దుతుంటే ఫలితం కనిపిస్తుంది.
ఆముదమూ తామర నివారణకు ఉపయోగపడుతుంది.
ఆముదాన్ని చర్మానికి బాగారాస్తే రెండు, మూడు రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.
క్యారెట్, పాలకూర రసం తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది.
రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా స్నానం చేయాలి.
రోజుకు రెండుసార్లు అరగంట చొప్పున బురద పట్టీ వేసినా తామర తగ్గడానికి అవకాశం ఉంటుంది.