బీట్‌రూట్, క్యారట్ మన శరీరంలో రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో ఐరన్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ఇది మన శరీరంలో రక్తకణాలను పెంచుతుం

గర్భిణులు వీట్ బ్రెడ్‌తో పాటు తృణధాన్యాలు, ఓట్‌మీల్‌ను ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది

ఎనీమియాతో బాధపడుతున్న వారు ఆకుపచ్చగా, తాజాగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలని డాక్టర్లు సలహా ఇస్తారు

ఎందుకంటే వీటిలో ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించే పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. శరీరంలో హెమోగ్లోబిన్ శాతం కూడా ఎక్కువవుతుంది

అలాగే యాపిల్స్, ద్రాక్ష, పుచ్చకాయ, ఎండు ద్రాక్ష.. మొదలైన పండ్లు తినడం వల్ల హెమోగ్లోబిన్ పెరుగుతుంది

గుడ్డులో ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది

చికెన్, మటన్, చేపలు.. మొదలైన వాటిల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది. కాబట్టి వీటివల్ల రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయులు రెట్టింపవుతాయి

శరీరంలో రక్తం పెరగాలంటే ఐరన్ ఎక్కువగా లభించే బాదం తినడం చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పట్నుంచైనా వీటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది

ఆకుకూరలు, క్యాబేజి, క్యాలీఫ్లవర్, చిలగడదుంప.. మొదలైనవన్నీ హెమోగ్లోబిన్ శాతం పెరగడంలో సహాయపడతాయి

మనం తినే ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించాలంటే విటమిన్ సి ఎక్కువగా లభించే ఆహారం, పానీయాలు తీసుకోవాలి. ఉదాహరణకి ఆరెంజ్ జ్యూస్.. ఇది ఆహారంలోని ఐరన్, దాని సప్లిమెంట్స్‌ను శరీరం గ్రహించేందుకు తోడ్పడుతుంది.

మరో ముఖ్యమైన విషయమేంటంటే.. ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్ధకం.. వంటి సమస్యలేవైనా ఎదురైతే ఐరన్‌ను చాలా నెమ్మదిగా శరీరంలోకి విడుదల చేసే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది