క్యాన్సర్ లక్షణాలను  ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్నారని, మూడో, నాలుగో దశల్లో ఆస్పత్రికి రావడం వల్ల ప్రాణాలు నిలబెట్టడం కష్టమవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు.

నాలుక, నోటి లోపలి భాగంలో పుండ్లు, తెల్లటి పూత నెలలపాటు ఉంటే వైద్యులను సంప్రదించాలి. నోరు తెరుచుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా అప్రమత్తం కావాలి.

రొమ్ముల్లో కణితులను గుర్తిస్తే వెంటనే పరీక్షించుకోవాలి. తల్లి, మేనత్త, సమీప బంధువుల్లో క్యాన్సర్లు ఉన్నా జాగ్రత్తపడాలి. జన్యుపరంగా వచ్చే కేసులు 8-9 శాతం వరకు ఉంటున్నాయి

 లైంగిక చర్య తర్వాత జననాంగాలపై ఎర్రటి దద్దుర్లు, పొక్కులు కనిపిస్తే పరీక్ష చేయించుకోవాలి.

సిగరెట్లు, చుట్టలు, పొగాకు పదార్థాలు వాడేవారిలో ఊపిరితిత్తులు, నాలుక, అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయి.

అధిక మద్యపానం, ఊబకాయం, వేపుళ్లు, నిల్వ ఆహారం తీసుకోవడం, జననాంగాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, మానసిక ఒత్తిడి కూడా కారణమవుతున్నాయి.

ఆరోగ్యకర జీవనశైలి, వ్యాయామం, పండ్లు, ఆకుకూరలు,   కూరగాయలు, తృణ ధాన్యాలతో మిళితమైన ఆహారం తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.