గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల్లో స్ట్రెచ్ మార్క్స్ రావ‌డం స‌హ‌జం. అధిక బ‌రువు ఉన్న మ‌హిళ‌ల్లోనూ ఇవి క‌నిపిస్తాయి.

పొట్ట‌పై ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ త‌గ్గించుకోవ‌డానికి స‌హ‌జ‌మైన ప‌ద్ద‌తుల్ని పాటించ‌డం ద్వారా కొంత వ‌ర‌కు ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

నిమ్మ‌ర‌సంలో కొద్దిగా పంచ‌దార‌, కొన్ని చుక్క‌ల కొబ్బ‌రినూనె లేదా ఆలివ్ నూనె క‌లిపి మిశ్ర‌మంలా త‌యారు చేసుకోవాలి. దీన్ని పొట్ట‌పై రాసి కాసేపు నెమ్మ‌దిగా మ‌ర్ద‌న చేసుకోవాలి.

క‌ల‌బంద సైతం స్ట్రెచ్ మార్క్స్ త‌గ్గించ‌డానికి సాయం చేస్తుంది.

క‌ల‌బంద గుజ్జుని చ‌ర్మానికి రాసి పావుగంట త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి.

రోజూ చేయ‌డం ద్వారా చ‌ర్మంపై ఏర్ప‌డిన స్ట్రెచ్ మార్క్స్ త‌గ్గే అవ‌క‌శం ఉంది.

ఆలివ్ నూనెను ఉప‌యోగించ‌డం ద్వారా కూడా పొట్ట‌పై ఏర్ప‌డిన స్ట్రెచ్ మార్క్స్ ని దూరం చేసుకోవ‌చ్చు.

ఆలివ్ నూనెను కొద్దిగా వేడిచేసి దాంతో మృదువుగా మ‌ర్ద‌న చేసుకోవాలి.

కొద్దిగా ఆముదంతో పొట్ట బాగాన్ని ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు గుండ్రంగా మ‌సాజ్ చేసుకోవాలి. త‌రువాత ప‌లుచ‌ని కాట‌న్ వ‌స్త్రంతో క‌ప్పాలి.

క్ర‌మం త‌ప్ప‌కుండా నెల రోజుల పాటు చేస్తే కొంత వ‌ర‌కు ఫ‌లితం క‌నిపిస్తుంది.

ఈ చిట్కాలు పాటించ‌డంతో పాటు అవ‌స‌ర‌మైతే వైద్యుల స‌ల‌హా మేర‌కు కొన్ని ర‌కాల ఉత్ప‌త్తుల‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు.