నాజూకు నడుము కోసం..హులా హూప్ బెస్ట్ అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు..
శరీరం మొత్తానికి వ్యాయామం అందించే ఈ సాధనం హులా హూప్
చక్కగా ఆడుకున్నట్లుగా చేయగలిగే వ్యాయామ సాధనం హులాహూప్..
సరదాగానూ ఉంటుంది. శారీరక శ్రమనూ ఇస్తుంది హులాహూప్..
రోజూ కాసేపు చేస్తే చాలు నాజూకు నడుము సొంతమవుతుంది..
హులా హూప్తో ఈజీగా శరీరంలో కెలొరీలు కరిగించుకోవచ్చు..ఈజీగా బరువూ తగ్గిపోవచ్చు..
నడుమూ, పిరుదుల్లో పేరుకుపోయిన కొవ్వును ఈజీగా కరిగించటానికి హులాహూప్ చక్కని వ్యాయామం.
ఈ రింగుతో వ్యాయాయం చేయడం వల్ల గుండె, వెన్ను ఆరోగ్యం బలపడతుంది.
హులా హూప్ ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రతా పెరుగుతుంది.