ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2022 ప్రారంభానికి ముందే స్పెషల్‌ రికార్డు.

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్‌.. 

ఏకంగా 222 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఇప్పటివరకు ఏ క్రికెట్‌ ఈవెంట్‌ కూడా ఇన్ని దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కాలేదు. 

ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి దాదాపు 10,000 గంటల ప్రత్యక్ష ప్రసారాన్ని ఛానెల్స్ ఇవ్వనున్నాయి. 

మ్యాచ్‌ జరిగే అన్ని స్టేడియాల్లో ఐసీసీ దాదాపు 35కు పైగా కెమరాలను ఏర్పాటు చేసింది.

మ్యాచ్‌ హైలెట్స్‌ను T20worldcup.com, టీ20 వరల్డ్‌ కప్‌ యాప్‌లో వీక్షించవచ్చు.

భారత్‌లో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌ వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 

స్టార్‌ స్పోర్ట్స్‌ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మలయాళం వంటి ప్రాంతీయ బాషల్లో కూడా ప్రసారం చేయనుంది.

అక్టోబర్‌ 16న గీలాంగ్ వేదికగా శ్రీలంక-నమిబీయా మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌-2022కు తెరలేవనుంది.