మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న దూరం కావాలంటే ఆహారంలో జాగ్ర‌త్త‌లు తీసుకొని ఉప‌శ‌మ‌నం పొందొచ్చు

ఆందోళ‌న‌, ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు ఏదైనా తినాల‌నిపిస్తే తాజా పండ్ల‌ను తీసుకోవాలి.

ఆహారంలో పోష‌క విలువ‌లు ఉన్న‌వాటిని ఎంచుకుంటే అనారోగ్యంతో పాటు ఒత్తిడీ దూర‌మ‌వుతుంది.

 గుమ్మ‌డి విత్త‌నాలు, బాదంప‌ప్పు, తాజా ఆకుకూర‌లు, జీడిప‌ప్పు వంటివాటిలో ఉండే మెగ్నీషియం మ‌న‌సును ప్ర‌శాంతంగా ఉంచుతుంది.

బెర్రీలు, నారింజ‌, జామ పండ్లు మెద‌డులోని న్యూరో ట్రాన్స్ మిట‌ర్ల‌ను స‌మ‌న్వ‌యం చేసి ఒత్తిడిని త‌గ్గిస్తాయి.

గుడ్లు, చేప‌, చికెన్ త‌క్కువ కొవ్వు ఉండే పాల ఉత్ప‌త్తులు, ఆకుకూర‌లు, చిక్కుడు గింజ‌లు వంటివి మెద‌డును చురుగ్గా ఉంచుతాయి.

ఆందోళ‌న‌ల‌కు కార‌ణ‌మ‌య్యే కార్టిసోల్ హార్మోన్‌ను త‌గ్గించి, మ‌న‌సును ప్ర‌శాంతంగా ఉంచుతాయి.

కాఫీ, టీలు త‌గ్గించుకోవాలి.

పాల‌లోగానీ, నిమ్మ‌ర‌సంలో గానీ తేనెను క‌లుపుకుని తాగితే చాలా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ప్రస్తుత జీవనశైలితో నిద్రవేళలు క్రమంగా తగ్గుతున్నాయి. కనీసం మనిషికి రోజుకు 7నుంచి 8 గంటల నిద్ర అవ‌సరం.