బరువు తగ్గటానికి, ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది రోజువారిగా వ్యాయామాలు చేస్తుంటారు..
కఠిన మైన వ్యాయామాల తరువాత చాలా మందికి నిస్సత్తువతో ఏపని చేయలేని పరిస్ధితి ఎదురవుతుంటుంది.
ఎందుకంటే వ్యాయామ సమయంలో పెద్ద మొత్తంలో కేలరీలు ఖర్చై పోతాయి. కొన్ని రకాల అత్యవసర పోషకాలను శరీరం కోల్పోవటమూ జరుగుతుంది.
వ్యాయామం తరువాత తక్షణ శక్తి కోసం అరకప్పు ఉడికించిన ఓట్స్ కానీ..ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదంపప్పుతో కలిపి తీసుకోవచ్చు.
ఒక అరటి పండు, ఒక గ్లాసు పాలు తీసుకోవటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
ఉడికించిన గుడ్డుని , పొట్టు తీయని తృణ ధాన్యాలతో కలపి తినటం వల్ల రోజుకు కావాల్సిన మాంసకృత్తులు సులభంగా అందుతాయి.
తక్కువ కెలొరీలు, ఎక్కువ ప్రొటీన్లతో ఉండే చీజ్ ను పండ్ల సలాడ్ లతో కలిపి తీసుకోవటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.
వ్యాయామాలు తరువాత తగినన్ని నీళ్లు తాగాలి..
అలాగే పిండి పదార్థాలు, ప్రొటీన్ సరైన మోతాదుల్లో తీసుకోవాలి. ఇవి కండరాల్లో ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతాయి.