అందరికీ పాలు అవసరమే కాగా ఎక్కువ శాతం మంది ఆధారపడేది మిల్క్ ప్యాకెట్స్ పైనే
ఏ కంపెనీ పాల ప్యాకెట్ అయినా దానిపై కొన్ని వివరాలు కామన్‌గా ఉంటాయి
ప్యాక్ చేసిన తేదీ.. ఎక్స్పైర్ డేట్.. మిల్క్‌లో ఫ్యాట్ శాతం అలా వివరాలు ఉంటాయి
కానీ ఇప్పుడు ఓ పాల ప్యాకెట్‌పై కళాశాల పేరు ముద్రించబడడం చర్చకు తావిస్తోంది
ఓ పాల ప్యాకెట్‌పై Founded By IIM Alumni అని ముద్రించడంపై రచ్చ జరుగుతుంది
Founded By IIM Alumni అంటే ఐఐఎం పూర్వ విద్యార్థి స్థాపించబడింది అని అర్ధం
ఓ వ్యక్తి మిల్క్ ప్యాకెట్ మీద IIM Alumni ముద్ర ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
దీంతో అది కాస్త వైరల్‌గా మారి అందరూ దీనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు
ఓ పాల ప్యాకెట్‌పై తన కాలేజీ పేరు వేసుకోవడం నెటిజన్స్‌లో చర్చకి తెరలేపుతోంది
IIM కాలేజీ పేరు చెప్పుకుని కాదు క్వాలిటీతో పేరు తెచ్చుకోవాలని కొందరు కామెంట్స్
ఏది ఏమైనా ఇప్పుడు IIM Alumni ముద్ర మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్