శీతాకాలంలో ఫ్లూ, ఫీవర్, దగ్గు వంటి వ్యాధులు వస్తుంటాయి. మరి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ కోసం ఈ హెర్బల్స్ చాలా అవసరం..

ఇమ్యూనిటీ కోసం రోజూ తాగే టీతోపాటు.. కొన్ని మూలికలు తీసుకోవడం అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

యాలకులు టీకి సువాసన ఇవ్వటమ కాదు వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. యాలకులపొడి శరీరంలోని వైరస్ తో పోరాడే కణాలను పెంచడంలో సహాయం చేస్తుంది.

జీర్ణ సమస్యలున్నవారు యాలకులతో తయారు చేసిన టీ తాగితే చక్కటి జీర్ణశక్తి కలుగుతుంది.

వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాల నుంచి కాపాడుతాయి. వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి..

తులసి యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

తులసి ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి కాపాడుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

తులసిలో ఫైటోకెమికల్స్, బయోఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా ఉంచుతుంది.

అల్లం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన మసాలా కూడా. ఇన్ఫెక్షన్‌లను దరిచేరనివ్వదు..

ఫ్లూ నుంచి బయటపడటానికి సరైన నివారణ అల్లం..జీవక్రియను పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తుంది.