కాటేసింది విషసర్పం కాకపోయినా ధైర్యం కోల్పోవడంతో ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోతారు. 

పాముకాటుకు గురైన వారు ధైర్యంగా ఉండాలి.

పాము కాటు వేసిన శరీరభాగాన్ని సబ్బునీరు లేదా యాంటీసెప్టిక్‌ లోషన్‌తో శుభ్రం చేయాలి. 

సాధ్యమైనంత వరకు పాము కాటేసిన శరీర భాగాన్ని కదిలించకూడదు.

నొప్పి తగ్గేందుకు ఎలాంటి మందులు వాడొద్దు.

పాము కాటు వేసిన చోట కొద్దిసేపు ఐస్‌ముక్క ఉంచడం మంచిది.

కాటు వేసిన భాగం నుంచి నోటితో రక్తం పీల్చకూడదు. ఆ ప్రాంతంలో కణజాలాన్ని కత్తితో కత్తిరించడం సరికాదు.

పాము కాటు వేసిన భాగం పైన గుడ్డతోగానీ తాడుతోగానీ గట్టిగా కట్టాలి. 15 నిమిషాలకోసారి వదులు చేసి మళ్లీ కట్టాలి. 

శరీరంలోకి తక్కువ విషం చేరితే మరణం సంభవించదు. 

పాము అంతకు ముందే వేరే మనిషి, జంతువును కాటేసిన తర్వాత రెండోసారి కాటేస్తే విషం తక్కువగా విడుదలవుతుంది.

సాధ్యమైనంత తొందరగా బాధితుడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. 

పాము కరిచిన గుర్తులను ఆధారంగా చేసుకుని అది విష సర్పమా..? కాదా నిర్ధారణ చేస్తారు.