ఆరోగ్యానికి మేలు చేయటంతోపాటు, శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటంలో దోహదపడే పండ్లలో సపోట కూడా ప్రధానమైనది.

సపోటాలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగు పరచటంలో ఎంతో ఉపయోగపడుతుంది. సపోటా గుజ్జుకు తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే గుణం ఉంది.

సపోటాలో తక్షణ శక్తినిచ్చే గ్లూకోజ్ లభిస్తుంది. సపోటా తినటం వల్ల త్వరగా కోల్పోయిన శక్తిని పొందేందుకు అవకాశం ఉంటుంది.

సపోటాలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.ఎముకల గట్టితనానికి, పెరుగుదలకు సహాయపడుతుంది.

పిండిపదార్ధాలు, పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు మంచిది.

వివిధ రకాల పని ఒత్తిడులతో గడిపే వారు సపోటా పండ్లు తినటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

స్ధూలకాయ సమస్య ఉన్న వారు సపోటా తినటం వల్ల కొంతమేర బరువును తగ్గించుకోవచ్చు.

సపోటాలో ఉండే విటమిన్ ఇ చర్మన్ని కాంతి వంతంగా మారుస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

జుట్టురాలటాన్ని నివారించి ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడుతుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.