పైనాపిల్‌లో ఉండే విటమిన్‌-ఎ ఉండటం వల్ల కంటికి మంచిది. మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

పైనాపిల్‌ తింటే జీర్ణసమస్యలు తొలిగిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.

బరువు తగ్గాలనుకునేవాళ్లు డైట్‌లో ఫైనాపిల్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బీపీని నియంత్రించటంలో పైనాపిల్‌ చక్కగా ఉపకరిస్తుంది.

దంతాలు, ఎముకల ఆరోగ్యానికి పైనాపిల్‌ మేలు చేస్తుంది. దగ్గు, జలుబు రాకుండా పనిచేస్తుంది. చర్మ ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదల ఉపకరిస్తుంది.

రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా పైనాపిల్‌ కాపాడుతుంది. మహిళల్లో నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.

పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఫైనాపిల్ రసం మంచిది.

పైనాపిల్ రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం మృదువుగా మారుతుంది. నల్లటి మచ్చలను తొలగిపోతాయి.

పైనాపిల్ లో ఉండే ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధుల ను, టైఫాయిడ్‌ వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తాయి.

గర్భిణీల్లో ఉదయం సమయంలో కనపించే సిక్ నెస్ ను తగ్గించుకోవటానికి ఫైనాపిల్ రసంలో కొద్దిగా అల్లం రసం కలిపి తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.