హఠాత్తుగా ఒకరి ఇంటి మీద రైడ్ చేసే అధికారం ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కి ఉంటుంది.

మొదటగా అధికారులకు అందిన సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకుంటారు.

సరైనదే అయితే ఓ టీమ్ ఏర్పాటు చేస్తారు.

టీమ్ సభ్యుల పేర్లు షీల్డ్ కవర్ లో ఉంటాయి.

ఎవరింట్లో రైడ్ చేయబోతున్నారో టీమ్ లీడర్ కి కూడా చివరి నిమిషం దాకా తెలియదు.

సమాచారం లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తారు.

రైడింగ్ లో ఏదైనా లాకర్ కి తాళం వేసి ఉంటే దాన్ని పగలగొడతారు.