ఆసియాకప్‌లో భాగంగా సూపర్-4లో ఇండియాతో జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేదించింది.