ఇన్సూరెన్స్‌ కంపెనీల ఆటలకు చెక్‌ పెట్టింది సుప్రీంకోర్టు

ఏదో ఒక కారణం చూపించి డబ్బులు ఇవ్వకపోవడం మానుకోవాలని కంపెనీలను ఆదేశించింది.

ఒక్కసారి పాలసీ  తీసుకున్నాక రోగాలను సాకుగా చూపి క్లెయిమ్‌ను ఆపొద్దని ఆదేశించింది.

పాలసీ హోల్డర్‌  అన్ని వివరాలను  ఇన్సూరెన్స్‌ కంపెనీకి తెలపాలని కోరింది.

మెడికల్‌ అప్రూవల్ వచ్చి పాలసీ ఇస్తే మాత్రం కంపెనీ క్లెయిమ్‌ చెల్లించాల్సిందే

మన్మోహన్‌ నందా అనే వ్యక్తి పిటిషన్‌పై  విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

నందా అమెరికాకు వెళ్లే సమయంలో యూనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ పాలసీ తీసుకున్నారు. 

క్లెయిమ్‌ని కంపెనీ తిరస్కరించగా.. బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించి క్లయిమ్ పొందాడు.