నోబెల్ బహుమతి.. ఆసక్తికర విషయాలు
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం నోబెల్
ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం 1901 నుంచి ఇస్తున్నారు.
శాంతి, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థికశాస్త్రం, వైద్య శాస్త్రంలో చేసిన సేవలకు..
ఏటా నోబెల్ బహుమతుల ప్రదానం.
తొలుత 5 రంగాల్లో నోబెల్ బహుమతిని అందించగా..
1969 నుంచి ఆర్థికశాస్త్రంలోనూ ఇస్తున్నారు.
ఇప్పటివరకు 950 మందికి ప్రదానం.
నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం.
మిగిలిన ఐదు రంగాల్లో నోబెల్ ను స్వీడన్ రాజధాని స్టోక్ హోంలో ఇస్తారు.
ఈ బహుమతుల గ్రహీతలను వివిధ సంస్థలు ఎంపిక చేస్తాయి.
శాంతి బహుమతిని నార్వేజియన్ పార్లమెంట్, సాహిత్యంలో స్వీడిష్ లిటరేచర్ అకాడమీ..
ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగంలో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్,
వైద్య రంగంలో కెరోలిన్ మెడికల్ ఇన్ స్టిట్యూట్,
ఆర్థికశాస్త్ర విభాగంలో బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఎంపిక చేస్తాయి.
ఒక సంవత్సరంలో నోబెల్ బహుమతికి ఒక విభాగంలో గరిష్ఠంగా ముగ్గురిని ఎంపిక చేస్తారు.
ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
గ్రహీతకు మెడల్, డిప్లొమా, నగదు(రూ.8.3కోట్లు)ను అందిస్తారు.