మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో అందిస్తున్న సేవలు గుర్తు చేసుకునే రోజు

లింగ సమానత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా సాధించే దిశగా ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. 

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పర్పుల్, గ్రీన్, వైట్ కలర్స్ లో రిప్రజెంట్ చేస్తుంటారు.

పర్పుల్ అనేది న్యాయానికి, హుందాతనానికి గుర్తు అయితే పచ్చదనం ఆశావాదానికి, తెలుపు స్వచ్ఛతకు గుర్తు. 

19వ శతాబ్ధం తొలినాళ్లలో రాడికల్ భావజాలం పెరిగిపోయిన గందరగోళ పరిస్థితుల్లో ఈ మహిళా దినోత్సవం మొదలైంది.

1910లో డెన్మార్క్‌లోని కోపెన్ హాగన్ శ్రామిక మహిళల రెండో అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు.

జర్మన్ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త క్లారా జెట్కిన్ ప్రతిపాదించి ప్రతి దేశంలో జరుపుకోవాలని సూచించారు.

17దేశాల నుంచి 100మంది మహిళలు, యూనియన్ లు, సోషలిస్ట్ పార్టీలు, శ్రామిక మహిళ సంస్థలు, ఫిన్నిష్ పార్లమెంట్ కు ఎంపికైన ముగ్గురు మహిళలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 

1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారిగా పాటించారు.

1975లో ఐక్యరాజ్యసమితి తొలిసారిగా స్పెషల్ డేగా గుర్తించింది.