కార్పొరేట్ వ్యాపారాలు వచ్చాక పాలలో కల్తీ ఎక్కువైంది
కొందరు కృత్రిమ పాలను తయారు చేసి అమ్మేస్తుంటారు
ప్యాకెట్స్‌లో పాలు కల్తీవో కాదో మనమే తెలుసుకోవచ్చు
ఏటవాలు ప్రాంతంపై పాల చుక్క వేస్తే నెమ్మదిగా జారి తెల్లని చార కనిపిస్తే ఒరిజినల్
అదే నీటిని కలిపిన పాల చుక్క సర్రున జారిపోయి ఎలాంటి చార కనిపించదు
కృత్రిమంగా తయారు చేసిన పాలను కూడా ఒక టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు
ఒక టెస్ట్ ట్యూబ్‌లో టీస్పూన్ పాలు, అర టీస్పూన్ పసుపు లేదా సోయాబీన్ పొడి కలపాలి
బాగా కలిపిన తర్వాత ఎరుపు రంగు లిట్మస్ పేపర్‌తో టెస్ట్ చేయండి
పేపర్ నీలి రంగులోకి మారితే.. పాలల్లో యూరియా కలిసినట్లు అని అర్ధం
పాలలో సమానమైన నీటిని బాగా కలిపితే నురుగు వస్తే డిటర్జెంట్ కలిసినట్లు
పాలను చర్మంపై రుద్దితే సబ్బు రుద్దిన ఫీలింగ్ వస్తే అవి సింథటిక్‌తో చేసిన పాలు