టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్..

బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి వెండితెరకు పరిచయం అయ్యాడు.

ఈ సినిమాని సీనియర్ ఎన్టీఆర్ నటిస్తూ డైరెక్ట్ చేశారు.

ఇక ఈ చిత్రం తరువాత 'బాల రామాయణం'లో రాముడిగా నటించాడు.

ఆ తరువాత 2001లో 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

రెండో సినిమాగా రాజమౌళి దర్శత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 చేశాడు.

2002లో ఆది సినిమాతో మాస్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు.

2003లో వచ్చిన సింహాద్రితో ఇండస్ట్రీ హిట్టు కొట్టి టాప్ స్టార్స్‌కి పోటీ ఇచ్చాడు.

అలా మొదలైన ఎన్టీఆర్ ప్రయాణం నేడు..

RRRతో గ్లోబల్ స్థాయికి చేరుకుంది.