కళాతపస్వి K విశ్వనాధ్ 1930 ఫిబ్రవరి 19న రేపల్లెలో జన్మించారు

1957లో సౌండ్ రికార్డర్ గా సినీ పరిశ్రమలో ప్రయాణం మొదలు పెట్టి కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్ గా పని చేశారు

అక్కినేని నాగేశ్వరరావు హీరోగా 1965 లో 'ఆత్మగౌరవం' సినిమాతో డైరెక్టర్ గా మారారు

శంకరాభరణం, సాగర సంగమం, సప్తపది,  స్వాతిముత్యం, స్వర్ణకమలం, సిరివెన్నెల,  ఆపద్భాందవుడు.. లాంటి ఎన్నో చరిత్రలో  నిలిచిపోయే ఆణిముత్యాల్లాంటి సినిమాలని  అందించారు

2010లో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కించిన 'శుభప్రదం' సినిమా డైరెక్టర్ గా ఆయన చివరి సినిమా

30కి పైగా సినిమాల్లో అద్భుతమైన పాత్రలతో నటుడిగా కూడా మెప్పించారు. కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు

హిందీలో 9 సినిమాలు తెరకెక్కించారు

1992లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 2017లో దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు అందుకున్నారు

ఆరు నేషనల్ అవార్డులు, 10 నంది అవార్డులు, 10 ఫిలిం ఫేర్ అవార్డులు.. లాంటి వాటితో పాటు మరెన్నో లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు అందుకున్నారు

ఈయన తీసిన చాలా సినిమాలు రష్యాలో కూడా డబ్ అయ్యాయి. ఎన్నో ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శించారు.