వంట మొదలు పెట్టడానికి ముందు చేతుల్ని సబ్బుతో కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి

కూరగాయలు, ఆకుకూరలను ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో కడగడం మంచిది

కూరగాయలను ఫ్రిజ్‌లో భద్రపరుస్తున్నప్పుడు ఒక్కో రకాన్ని ఒక్కో కాగితపు సంచిలో ప్యాక్‌ చేస్తే త్వరగా వడలిపోవు

పండ్లను ఓ అరలో, కూరగాయలను మరో దాంట్లో పెట్టడం మంచిది

పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలనుకున్నప్పుడు మూత ఉన్న డబ్బాలో ఉంచాలి

వండని మాంసం, చేపలు వంటి వాటిని కూరగాయలు, పండ్లకు దూరంగా ఉంచాలి

లేదంటే వాటిపై ఉండే బ్యాక్టీరియా పండ్లు, కూరగాయలకు వ్యాపించి పలు అనారోగ్యాలు వచ్చే అవకాశం

ఒకసారి వండిన మాంసాన్ని మరోసారి వేడి చేయాలనుకుంటే

ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తే బ్యాక్టీరియా నశిస్తుందో ముందుగా తెలుసుకోవాలి

పండ్లు, కూరగాయలు, మాంసాన్ని.. కట్‌ చేయడానికి, వండటానికి వేర్వేరు చాకులు, పాత్రలు ఎంచుకోవడం మంచిది